Bible, యాకోబు, అధ్యాయం 1. is available here: https://www.bible.promo/chapters.php?id=11147&pid=61&tid=2&bid=61
Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible

Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / యాకోబు

Bible - Telugu Bible OV, 1880

హెబ్రీయులకు యాకోబు 1 పేతురు

అధ్యాయం 1 2 3 4 5

1 దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు దాసుడైన యాకోబు అన్యదేశముల యందు చెదిరియున్న పన్నెండు గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయునది

2 "నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగుపరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి,"

3 "మీరు నానా విధములైన శోధనలలో పునప్పుడు, అది మహానందమని ఎంచుకొనుడి."

4 "మీరు సంపూర్ణులును, అనాంగులును, ఏ విషయములోనైనను కొదువలేనివారునై యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి."

5 "మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు."

6 అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను; సందేహించువాడు గాలిచేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును.

7 "అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై, తన సమస్త మార్గములయందు అస్ధిరుడు,"

8 గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచు కొనరాదు.

9 దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నతదశయందు అతిశయింప వలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశయందు అతిశయింపవలెను.

10 "ఏలయనగా, ఇతడు గడ్డిపువ్వువలె గతించిపోవును."

11 "సూర్యుడుదయించి, వడగాలి కొట్టి, గడ్డిని మాడ్చివేయగా దాని పువ్వురాలును, దాని స్వరూప పౌందర్యమును నశించును; ఆలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును."

12 శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును.

13 దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు - నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు.

14 ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరుల కొల్పబడినవాడై శోధింపబడును.

15 "దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును."

16 "నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి."

17 "శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును; ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయయైనను లేదు."

18 ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను.

19 "నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడు వాడును, మాటలాడుటకు నిదానించు వాడును, కోపించుటకు నిదానించువాడునై యుండవలెను."

20 ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు.

21 "అందుచేత సమస్త కల్మషమును, విఱ్ఱవీగుచున్న దుష్టత్వమును మాని, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి."

22 "మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చు కొనకుండ, వాక్యప్రకారము ప్రవర్తించువారునై యుండుడి."

23 "ఎవడైనను వాక్యమును వినువాడైయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే, వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు."

24 వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోవును గదా.

25 "అయితే స్వాతంత్య్రము నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలుకడగా ఉండు వాడెవడో వాడు విని మరచువాడుకాక, క్రియను చేయువాడైయుండి తన క్రియలో ధన్యుడగును."

26 ఎవడైనను నోటికి కళ్లెము పెట్టుకొనక తన హృదయమును మోసరపచుకొనుచు భక్తిగల వాడనని అనుకొనిన యెడల వాని భక్తి వ్యర్థమే.

27 "తండ్రియైన దేవుని యెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా- దిక్కులేని పిల్లలను విధవ రాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే."

<< Prev Top Next → >>