Bible, హెబ్రీయులకు, అధ్యాయం 13. is available here: https://www.bible.promo/chapters.php?id=11146&pid=60&tid=2&bid=61
Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible

Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / హెబ్రీయులకు

Bible - Telugu Bible OV, 1880

ఫిలేమోనుకు హెబ్రీయులకు యాకోబు

అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13

1 సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. ఆతిథ్యము చేయ మరవకుడి; దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి.

2 మీరును వారితో కూడ బంధిపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకము చేసికొనుడి.

3 మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టముల ననుభవించుచున్నా వారిని జ్ఞాపకము చేసికొనుడి.

4 "వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను; వేశ్యాంగులకును, వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును."

5 "ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది యుండుడి. -నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పెను గదా."

6 "కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? అని మంచి ధైర్యముతో చెప్పగల వారమైయున్నాము."

7 "మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసికొని, వారి ప్రవర్తన ఫలమును, శ్రద్ధగా తలంచు కొనుచు, వారి విశ్వాసమును అనుసరించుడి."

8 "యేసుక్రీస్తు నిన్న, నేడు, ఒక్కటే రీతిగా ఉన్నాడు; అవును, యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును."

9 "నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. భోజన పదార్ధములను బట్టి కాక, కృపనుబట్టియే హృదయము స్ధిరపరచు కొనుట మంచిది; భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమియు ప్రయోజనము కలుగలేదు."

10 మనకొక బలిపీఠమున్నది; దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవచేయు వారికి అధికారము లేదు.

11 "వేటి రక్తము పాప పరిహరార్థముగ పరిశుద్ధ స్థలములోనికి ప్రధానయాజకుని చేత తేబడునో, ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును."

12 కావున యేసు కూడ తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధ పరచుటకై గవిని వెలుపట శ్రమపొందెను.

13 కాబట్టి మనమాయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్లుదము.

14 "నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని, ఉండబోవుచున్న దాని కోసరము ఎదురు చూచుచున్నాము."

15 "కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము."

16 "ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికిష్టమైనవి."

17 "మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్కఒప్ప చెప్పవలసిన వారివలె మీ ఆత్మలను కాయుచున్నారు; వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక, ఆనందముతో చేయునట్లు వారి మాట విని, వారికి లోబడియుండుడి. వీడ్కోలు సందేశములు"

18 మా నిమిత్తము ప్రార్థనచేయుడి; మేమన్ని విషయములలోను యోగ్యముగా ప్రవర్తింప గోరుచు మంచి మనస్సాక్షి కలిగి యున్నామని నమ్ముకొనుచున్నాము.

19 మరియు నేను మరి త్వరగా మీ యొద్దకు మరల వచ్చునట్లు ఈలాగు చేయవలెనని మరి ఎక్కువగా మిమ్మును బతిమాలు కొనుచున్నాను.

20 "గొఱ్ఱెల గొప్ప కాపరియైన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధాన కర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు, ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక."

21 "యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగును గాక, ఆమేన్."

22 "సహోదరులారా, మీకు సంక్షేపముగా వ్రాసియున్నాను గనుక ఈ హెచ్చరిక మాటను సహించుడని మిమ్మును వేడుకొనుచున్నాను."

23 మన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగినదని తెలిసికొనుడి. అతడు శీఘ్రముగా వచ్చిన యెడల అతనితో కూడ వచ్చి మిమ్మును చూచెదను.

24 మీ పైని నాయకులైన వారి కందరికిని పరిశుద్ధులకందరికిని నా వందనములు చెప్పుడి. ఇటలీ వారు మీకు వందనములు చెప్పుచున్నారు.

25 "కృప మీ కందరికి తోడైయుండును గాక, ఆమేన్."

<< ← Prev Top Next >>