Bible, హెబ్రీయులకు, అధ్యాయం 11. is available here: https://www.bible.promo/chapters.php?id=11144&pid=60&tid=2&bid=61
Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible

Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / హెబ్రీయులకు

Bible - Telugu Bible OV, 1880

ఫిలేమోనుకు హెబ్రీయులకు యాకోబు

అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13

1 "విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటియొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునైయున్నది."

2 దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి.

3 "ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడొ పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసముచేత గ్రహించు కొనుచున్నాము."

4 "విశ్వాసమునుబట్టి, హేబెలు కయీను కంటె శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతినొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు."

5 విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను; అతడు కొనిపోబడకమునుపు దేవునికి ఇష్టుడై యుండెనని సాక్ష్యము పొందెను; కాగా దేవుడతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు.

6 "విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా!"

7 "విశ్వాసమునుబట్టి నోవహు అదివరకు చూడని సంగతులను గూర్చి దేవునిచేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై, తన ఇంటివారి రక్షణకొరకు ఒక ఓడను సిద్ధముచేసెను; అందువలన అతడు లోకము మీద నేరస్థాపనచేసి విశ్వాసమునుబట్టి కలుగు నీతికి వారసుడాయెను."

8 "అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమునుబట్టి ఆ పిలుపునకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలువెళ్లెను. మరియు ఎక్కడికి వెళ్లవలెనో అది ఎరుగక బయలువెళ్లెను;"

9 "విశ్వాసమును బట్టి అతడును, అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును, గుడారములలో నివసించుచు, అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్తదేశములో పరవాసులైరి."

10 "ఏలయనగా, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో, పునాదులుగల ఆ పట్టణముకొరకు అబ్రాహాము ఎదురుచూచుచుండెను."

11 విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించిదైనను గర్భము ధరించుటకు శక్తిపొందెను.

12 "అందుచేత మృతతుల్యుడైన ఆ యొకనినుండి, సంఖ్యకు ఆకాశనక్షత్రములవలెను, సముద్రతీరమందలి లెక్కింప శక్యముకాని యిసుకవలెను సంతానము కలిగెను."

13 "వీరందరు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను దూరమునుండి చూచి వందనముచేసి, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పుకొని, విశ్వాసము గలవారై మృతినొందిరి."

14 ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నామని విశదపరచు చున్నారు కారా?

15 వారు ఏ దేశమునుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకొన్న యెడల మరల వెళ్లుటకు వారికి వీలు కలిగియుండును.

16 "అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును, అనగా పరలోకసంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు; ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరచి యున్నాడు."

17 అబ్రాహాము శోధింపబడి విశ్వాసమునుబట్టి ఇస్సాకును బలిగా అర్పించెను.

18 "ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో, - ఇస్సాకు వలననైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడెనో, ఆ అబ్రాహాము, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై,"

19 "తన ఏకకుమారుని అర్పించి, ఉపమానరూపముగా అతనిని మృతులలో నుండి మరల పొందెను."

20 విశ్వాసము బట్టి ఇస్సాకు జరుగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను.

21 విశ్వాసమునుబట్టి యాకోబు అవసానకాల మందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతికఱ్ఱ మొదలుమీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను.

22 యోసేపు తనకు అవసానకాలము సమీపించినప్పుడు విశ్వాసమునుబట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమనమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను.

23 "మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై యుండుట చూచి, విశ్వాసమునుబట్టి రాజాజ్ఞకు భయపడక, మూడు మాసములు అతని దాచిపెట్టిరి."

24 మోషే పెద్దవాడైనప్పుడు

25 "విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు;"

26 ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టియుంచెను.

27 "విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైనవానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధిగలవాడై, రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను."

28 "తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలీయులను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమునుబట్టి పస్కాను, రక్తప్రోక్షణ ఆచారమును ఆచరించెను."

29 విశ్వాసమునుబట్టి వారు పొడినేల మీద నడిచినట్లు ఎఱ్ఱ సముద్రములోబడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు ఆలాగు చేయచి మునిగిపోయిరి.

30 విశ్వాసమునుబట్టి ఏడు దినములవరకు ప్రదక్షిణ చేయబడిన తరువాత యెరికో గోడలు కూలెను.

31 విశ్వాసమునుబట్టి రాహాబను వేశ్య వేగులవారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపక పోయెను.

32 "ఇకను ఏమి చెప్పుదును ? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలను వారిని గూర్చియు, ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు."

33 వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి; నీతికార్యములను జరిగించిరి; వాగ్దానములను పొందిరి; సింహముల నోళ్లను మూసిరి;

34 అగ్నిబలమును చల్లార్చిరి; ఖడ్గధారను తప్పించుకొనిరి; బలహీనులుగా ఉండి బలపరచబడిరి; యుద్ధములో పరాక్రమశాలులైరి; అన్యుల సేనలను పారదోలిరి.

35 స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరల పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతనపెట్టబడిరి.

36 "మరికొందరు తిరస్కారములను కొరదెబ్బలను, మరి బంధకములను ఖైదును అనుభవించిరి."

37 "రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి,"

38 "గొఱ్ఱెచర్మములను మేకచర్మములను వేసికొని, దరిద్రులైయుండి శ్రమపడి హింసపొందుచు, అడవులలోను కొండలమీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు."

39 "వీరందరు తమ విశ్వాసముద్వారా సాక్ష్యము పొందినవారైనను,"

40 మనము లేకుండ సంపూర్ణులు కాకుండు నిమిత్తము దేవుడు మనకొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచెను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింప లేదు.

<< ← Prev Top Next → >>