Bible, 2 థెస్సలొనీకయులకు, అధ్యాయం 2. is available here: https://www.bible.promo/chapters.php?id=11118&pid=55&tid=2&bid=61
Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible

Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / 2 థెస్సలొనీకయులకు

Bible - Telugu Bible OV, 1880

1 థెస్సలొనీకయులకు 2 థెస్సలొనీకయులకు 1 తిమోతికి

అధ్యాయం 1 2 3

1 "సహోదరులారా, ప్రభువు దినమిప్పుడే వచ్చియున్నట్లుగా ఆత్మ వలననైనను మాటవలనైనను మాయొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలననైనను ఎవడైనను చెప్పినయెడల,"

2 "మీరు త్వరపడి చంచలమనస్కులు కాకుండవలెననియు బెదరకుండవలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకను బట్టియు, మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టియు, మిమ్మును వేడుకొనుచున్నాము."

3 మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు (ధర్మవిరుద్ధ పురుషుడు) బయలుపడితేనే గాని ఆ దినము రాదు.

4 "ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో, దాని నంతటిని ఎదిరించుచు, దానికంతటికి పైగా వాడు తన్నుతానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనపరచుకొనుచు, దేవుని ఆలయములో కూర్చుండును, గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి."

5 నేనింకను మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకము లేదా?

6 కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డగించునది ఏదో అది మీరు ఎరుగుదురు.

7 ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును.

8 అప్పుడు ధర్మవిరోధి బయలు పరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును.

9 నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్యవిషయమైన ప్రేమను అవలంబింపక పోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను నానా విధములైన సూచక క్రియలతోను మహత్కార్యములతోను

10 దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్నవారిలో సాతాను కనబరచు బలమును అనుసరించి యుండును.

11 "ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాష గల వారందరును శిక్షా విధి పొందుటకై,"

12 అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు.

13 "ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధ పరచుట వలనను, మీరు సత్యమును నమ్ముట వలనను, రక్షణ పొందుటకు దేవుడు ఆదినుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై యున్నాము."

14 మీరీలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను.

15 "కాబట్టి సహోదరులారా, నిలకడగా నుండి, మా నోటి మాటవలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి."

16 "మన ప్రభువైన యేసుక్రీస్తును, మనలను ప్రేమించి, కృపచేత నిత్యమైన ఆదరణయు, శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రియైన దేవుడును,"

17 మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచును గాక.

<< ← Prev Top Next → >>