Bible, ఫిలిప్పీయులకు, అధ్యాయం 2. is available here: https://www.bible.promo/chapters.php?id=11105&pid=52&tid=2&bid=61
Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible

Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / ఫిలిప్పీయులకు

Bible - Telugu Bible OV, 1880

ఎఫెసీయులకు ఫిలిప్పీయులకు కొలస్సయులకు

అధ్యాయం 1 2 3 4

1 "కావున క్రీస్తునందు ఏ హెచ్చరికయైనను, ప్రేమవలన ఆదరణయైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న యెడల"

2 "మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి, ఏకభావము కలవారుగా నుండి, ఒక్కదానియందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి."

3 "కక్షచేతనైనను, వృధాతిశయము చేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సు గలవారై, ఒకనినొకడు తన కంటె యోగ్యుడని ఎంచుచు,"

4 మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడ చూడవలెను.

5 క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడ కలిగియుండుడి.

6 "ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైయుండి, దేవునితో సమానముగా నుండుట విడచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని,"

7 "మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్నుతానే రిక్తునిగా చేసుకొనెను."

8 "మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి, మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను."

9 "అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని"

10 "ప్రతి మోకాలును యేసు నామమున వంగునట్లును,"

11 "ప్రతి వాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును, ఆయనకు అనుగ్రహించెను."

12 "కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడు విధేయులైయున్న ప్రకారము, నా యెదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును, భయముతోను, వణకుతోను, మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి."

13 "ఎందుకనగా మీరు ఇచ్ఛయించు టకును, కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై, మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే."

14 "మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులును నిష్కళంకులును అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు,"

15 "సణుగులును సంశయములును మాని, సమస్త కార్యములను చేయుడి."

16 "అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని, లోకమందు జ్యోతులవలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగను,"

17 "మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను, నేనానందించి మీ యందరితోను కూడ సంతోషింతును."

18 ఇటువలెనే మీరు కూడ ఆనందించి నాతో సంతోషించుడి.

19 నేనును మీ క్షేమము తెలిసికొని ధైర్యము తెచ్చుకొను నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీయొద్దకు పంపుటకు ప్రభువైన యేసు నందు నిరీక్షించుచున్నాను.

20 "మీ క్షేమము విషయమై నిజముగా చింతించువాడు, అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు."

21 అందరును తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు.

22 అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడేలాగు సేవ చేయునో ఆలాగే అతడు నాతో కూడ సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను.

23 కాబట్టి నాకేమి సంభవింపనైయున్నదో చూచిన వెంటనే అతనిని పంపవలెనని అనుకొనుచున్నాను.

24 నేనును శీఘ్రముగా వచ్చెదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను.

25 "మరియు నా సహోదరుడును, జతపని వాడును, నాతోడి యోధుడును, మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడైన ఎపఫ్రొదితును మీయొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని."

26 అతడు రోగి ఆయెనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మునందరిని చూడ మిగుల ఆపేక్ష గలవాడై విచార పడుచుండెను.

27 నిజముగా అతడు రోగియై చావుకు సిద్ధమై యుండెను గాని దేవుడతనిని కనికరించెను.అతనిని మాత్రమే గాక నాకు దుఃఖముమీద దుఃఖము కలుగకుండుటకై నన్ను కూడ కనికరించెను.

28 కాబట్టి మీరు అతనిని చూచి మరల సంతోషించు నిమిత్తమును నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రముగా పంపితిని.

29 "నా యెడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక,"

30 క్రీస్తు ప్రభువు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై యుండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టివారిని ఘనపరచుడి.

<< ← Prev Top Next → >>