Bible, 2 కొరింథీయులకు, అధ్యాయం 11. is available here: https://www.bible.promo/chapters.php?id=11089&pid=49&tid=2&bid=61
Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible

Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / 2 కొరింథీయులకు

Bible - Telugu Bible OV, 1880

1 కొరింథీయులకు 2 కొరింథీయులకు గలతీయులకు

అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13

1 "కొంచెమవివేకముగా నేను మాటలాడినను మీరు సహింపవలెనని కోరుచున్నాను, నన్ను మీరేలాగైనను సహించుడి."

2 "దేవాసక్తితో మీయెడల ఆసక్తి కలిగియున్నాను. ఎందుకనగా, పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని, మిమ్మును ప్రధానము చేసితిని గాని,"

3 సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులు చెరుపబడి క్రీస్తు యెడల నున్న సరళతనుండియు పవిత్రత నుండియు ఎట్లయినను తొలగి పోవునేమోయని భయపడుచున్నాను.

4 "ఏలయనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి యొక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరియొక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరియొక సువార్త మీరు అంగీకరించినను, మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే."

5 నేనైతే మిక్కిలి శ్రేష్టులైన ఈ అపొస్తలులకంటె లేశ మాత్రమును తక్కువ వాడను కాదని తలంచు కొనుచున్నాను.

6 మాటలయందు నేను నేర్పులేని వాడనైనను జ్ఞానమందు నేర్పులేని వాడను కాను. ప్రతి సంగతిలోను అందరి మధ్యను మీ నిమిత్తము మేము ఆ జ్ఞానమును కనపరచి యున్నాము.

7 మిమ్మును హెచ్చింపవలెనని మీకు దేవుని సువార్తను ఉచితముగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకొనినందున పాపము చేసితినా ?

8 "మీకు పరిచర్య చేయుటకై, నేనితర సంఘముల వలన జీతము పుచ్చుకొని, వారి ధనము దొంగిలిన వాడనైతిని."

9 "మరియు నేను మీ యొద్ద ఉన్నప్పుడు నాకక్కర కలిగి యుండగా నేనెవని మీదను భారము మోపలేదు; మాసిదోనియ నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. ప్రతి విషయములోను నేను మీకు భారముగా ఉండకుండ జాగ్రత్త పడితిని, ఇక ముందుకును జాగ్రత్త పడుదును."

10 క్రీస్తు సత్యము నాయందు నుండుట వలన అకయ ప్రాంతములయందు నేనీలాగు అతిశయపడకుండ నన్ను ఆటంక పరచుటకు ఎవరి తరము కాదు.

11 ఎందువలన? నేను మిమ్మును ప్రేమింప నందువలననా ? దేవునికే తెలియును.

12 "అతిశయ కారణము వెదకువారు ఏ విషయములో అతిశయించుచున్నారో, ఆ విషయములో వారును మావలెనే యున్నరని కనబడు నిమిత్తము వారికి కారణము దొరకకుండ కొట్టివేయుటకు, నేను చేయుచున్న ప్రకారమే ఇక ముందుకును చేతును."

13 "ఏలయనగా అట్టివారు క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము ధరించుకొనువారై యుండి, దొంగ అపొస్తలులును మోసగాండ్రగు పని వారునై యున్నారు."

14 ఇది ఆశ్చర్యము గాదు. సాతాను తానే వెలుగు దూత వేషము ధరించు కొనుచున్నాడు.

15 గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును.

16 నేను అవివేకినని ఎవడును తలంచ వద్దని మరల చెప్పుచున్నాను. అట్లు తలంచిన యెడల నేను కొంచెము అతిశయపడునట్లు నన్ను అవివేకినైనట్టుగానే చేర్చుకొనుడి.

17 "నేను చెప్పుచున్నది ప్రభువు మాట ప్రకారము చెప్పుట లేదు గాని, ఇట్లు అతిశయపడుటకు ఆధారము కలిగి అవివేకివలె చెప్పుచున్నాను."

18 అనేకులు శరీర విషయములో అతిశయపడుచున్నారు గనుక నేనును ఆలాగే అతిశయపడుదును.

19 మీరు వివేకులై యుండి సంతోషముతో అవివేకులను సహించుచున్నారు.

20 "ఒకడు మిమ్మును దాస్యమునకు లోబరచినను, ఒకడు మిమ్ము మ్రింగి వేసినను ఒకడు మిమ్ము వశపరచుకొనినను, ఒకడు తన్ను గొప్ప చేసికొనినను, ఒకడు ముఖము మీద మిమ్మును కొట్టినను మీరు సహించుచున్నారు."

21 "మేము బలహీనులమై యున్నట్టు అవమానముగా మాటలాడుచున్నాను, ఏ విషయమందు ఎవడైన ధైర్యము కలిగి యున్నాడో, ఆ విషయమందు నేను కూడ ధైర్యము కలిగిన వాడను; అవివేకముగా మాటలాడుచున్నాను సుమా."

22 వారు హెబ్రీయులా? నేనును హెబ్రీయుడనే. వారు ఇశ్రాయేలీయులా? నేనును ఇశ్రాయేలీయుడనే. వారు అబ్రాహాము సంతానమా ? నేనును అట్టివాడనే.

23 "వారు క్రీస్తు పరిచారకులా ? వెర్రివానివలె మాటలాడు చున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని; అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని."

24 యూదుల చేత అయిదు మారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తింటిని.

25 ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని; ఒకసారి రాళ్ళతో కొట్టబడితిని; ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని; ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపడితిని.

26 "అనేక పర్యాయములు ప్రయాణములోను, నదులవలనైన ఆపదలలోను, దొంగల వలననైన ఆపదలలోను, నాస్వజనులవలనైన ఆపదలలోను, అన్యజనుల వలననైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలని ఆపదలలోను ఉంటిని."

27 "ప్రయాసతోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను యుంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి."

28 ఇవియును గాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది.

29 ఎవడైనను బలహీనుడాయెనా? నేనును బలహీనుడను కానా? ఎవడైనను తొట్రుపడెనా? నాకును మంట కలుగదా?

30 అతిశయపవలసి యుంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గూర్చియే అతిశయపడుదును

31 నేనబద్ధ మాడుట లేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువగు యేసు యొక్క తండ్రియైన దేవుడు ఎరుగును.

32 దమస్కులో అరెత అను రాజు క్రింద యున్న అధిపతి నన్ను పట్టగోరి కావలియుంచి దమస్కీయుల పట్టణమును భద్రము చేసెను.

33 అప్పుడు నేను కిటికీ గుండ గోడమీద నుండి గంపలో దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకొనిపోతిని.

<< ← Prev Top Next → >>