1 "మీ యెదుట నున్నప్పుడు మీలో అణుకువ గలవాడనైనట్టియు, ఎదుట లేనప్పుడు మీ యెడల ధైర్యము గలవాడనైనట్టియు, పౌలను నేను యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను."
2 శరీరప్రకారము నడుచుకొనువారమని మమ్మును గూర్చి కొందరును కొనుచున్నారు కారా? అట్టివారి యెడల నేను తెగించి కాఠిన్యము చూపవలెనని తలంచు కొనుచున్నాను గాని నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యము చూపకుండునట్లు చేయుడని నేను మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను.
3 మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము.
4 "మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని, దేవుని యెదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవైయున్నవి."
5 "మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమునుడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోపడునట్లు చెరపట్టి,"
6 మీరు సంపూర్ణ విధేయతను కనబరచునప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడియున్నాము.
7 సంగతులను పైపైననే మీరు చూచుచున్నారు. ఎవడైనను తాను క్రీస్తు వాడనని నమ్ముకున్నయెడల అతడేలాగు క్రీస్తు వాడో అలాగే మేమును క్రీస్తు వారమని తన మనస్సులో తాను తిరిగి ఆలోచించుకొనవలెను.
8 పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు మాకనుగ్రహించిన అధికారమును గూర్చి నేనొక వేళ కొంచెము అధికముగా అతిశయ పడినను నేను సిగ్గు పరచబడను.
9 నేను వ్రాయు పత్రికలవలన మిమ్మును భయపెట్టవలెనని ఉన్నట్టు కనబడకుండ ఈ మాట చెప్పుచున్నాను.
10 "అతని పత్రికలు ఘనమైనవియు, బలీయమైన వియునైయున్నవి గాని అతడు శరీర రూపమునకు బలహీనుడు. అతని ప్రసంగము కొరగానిదని యొకడు అనును."
11 "మేమెదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాటలయందెట్టివారమై యున్నామో, యెదుట ఉన్నప్పుడు క్రియయందును అట్టి వారమై యుందుమని అట్లనువాడు తలంచు కొనవలెను."
12 "తమ్మును తామే మెచ్చుకొను కొందరితో జతపరచుకొనుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింపజాలము గాని వారు తమలోనే యొకరిని బట్టి యొకరు ఎన్నిక చేసుకొని, యొకరితో నొకరు సరిచూచుకొను చున్నందున గ్రహింపు లేకయున్నారు."
13 "మేమైతే మేరకు మించి అతిశయపడము గాని, మీరున్న స్థలము వరకును రావలెనని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడియుండి అతిశయించుచున్నాము."
14 మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు మీ వరకు వచ్చియుంటిమి గనుక మీ యొద్దకు రాని వారమైనట్టు మేము మా మేర దాటివెళ్ళుచున్న వారము కాము.
15 "మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులమనుకొని అతిశయపడము. మీ విశ్వాసము అభివృద్ధియైన కొలది మాకనుగ్రహింపబడిన మేరలకు లోపలనే సువార్త మరి విశేషముగా వ్యాపింప జేయుచు,"
16 "మీ ఆవలి ప్రదేశములలో కూడ సువార్త ప్రకటించునట్లుగా మేము మీ మూలముగా ఘనపరచబడుదుమని నిరీక్షించుచున్నామే గాని, మరియొకని మేరలో చేరి, సిద్ధమైయున్నవి మావియైనట్టు అతిశయింపగోరము."
17 అతిశయించు వాడు ప్రభువునందే అతిశయింప వలెను.
18 "ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు గాని, తన్ను తానే మెచ్చు కొనువాడు యోగ్యుడు కాడు." |