Bible, రోమీయులకు, అధ్యాయం 1. is available here: https://www.bible.promo/chapters.php?id=11047&pid=47&tid=2&bid=61
Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible

Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / రోమీయులకు

Bible - Telugu Bible OV, 1880

అపొస్తలుల కార్యములు రోమీయులకు 1 కొరింథీయులకు

అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

1 "యేసుక్రీస్తు దాసుడును, అపొస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును"

2 "దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడినవాడైన పౌలు రోమాలో నున్న దేవుని ప్రియులందరికి, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికిని శుభమని చెప్పి వ్రాయునది."

3 "మన తండ్రియైన దేవుని నుండియు, ప్రభువైన యేసుక్రీస్తు నుండియు, కృపా సమాధానములు మీకు కలుగును గాక."

4 "దేవుడు తన కుమారుడును, మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను."

5 "యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను."

6 "ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు, ఈయన ద్వారా మేము కృపను అపొస్తలత్వమును పొందితిమి."

7 "మీరును వారిలో ఉన్నవారై, యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువ బడియున్నారు."

8 "మీ విశ్వాసము సర్వలోకమునకు ప్రచురణ చేయబడుచుండుటను బట్టి, మొదట మీయందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను."

9 "ఇప్పుడేలాగైనను ఆటంకము లేకుండ మీయొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని,"

10 "నా ప్రార్థనలయందు ఎల్లప్పుడు ఆయనను బతిమాలు కొనుచు, మిమ్మును గూర్చి యెడతెగక జ్ఞాపకము చేసుకొను చున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి."

11 "మీరు స్థిరపడవలెనని అనగా మీకును నాకును కలిగిన విశ్వాసము చేత అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలెనని,"

12 ఆత్మ సంబంధమైన కృపా వరమేదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలెనని మిగుల అపేక్షించుచున్నాను.

13 "సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో, ఫలము పొందినట్లు మీలో కూడ ఫలమేదైనను పొందవలెనని అనేక పర్యాయములు మీ యొద్దకు రానుద్దేశించితిని. కాని ఇదివరకు ఆటంకపరచబడితిని, ఇది మీకు తెలియకుండుట నా కిష్టము లేదు."

14 "గ్రీసు దేశస్థులకును, గ్రీసు దేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును, మూఢులకును నేను ఋణస్థును."

15 కాగా నావలననైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను.

16 "సువార్తను గూర్చి నేను సిగ్గు పడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది."

17 "ఎందుకనిన - నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము, విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు, దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది."

18 "దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను, దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది."

19 "ఎందుకనగా, దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమైయున్నది; దేవుడు అది వారికి విశదపరచెను."

20 "ఆయన అదృశ్యలక్షణములు - అనగా ఆయన నిత్యశక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది గనుక వారు నిరుత్తరులై యున్నారు."

21 "మరియు వారు దేవుని నెరిగియు, ఆయనను దేవునిగా మహిమ పరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కాని తమ వాదముల యందు వ్యర్థులైరి."

22 వారి అవివేక హృదయము అంధకార మయమాయెను; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి.

23 "వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు, ప్రతిమా స్వరూపముగా మార్చిరి."

24 "ఈ హేతువు చేత, వారు తమ హృదయముల దురాశలననుసరించి తమ శరీరములను పరస్పరము అవమాన పరచుకొనునట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను."

25 "అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగములవరకు ఆయన స్తోత్రార్హుడై యున్నాడు ఆమేన్!"

26 అందువలన దేవుడు తుచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైనచ్ఛ ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి.

27 "అటువలె పురుషులు కూడ స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి, పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి యెడల నొకరు కామతప్తులైరి."

28 మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్టమనస్సుకు వారి నప్పగించెను.

29 "అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్యచేతను నిండుకొని, మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండినవారై,"

30 "కొండెగాండ్రును, అపవాదకులును, దేవద్వేషులును, హింసకులును, అహంకారులును, బింకములాడువారును, చెడ్ఢవాటిని కల్పించువారును, తలిదండ్రులకు అవిధేయులును, అవివేకులును,"

31 "మాట తప్పువారును, అనురాగ రహితులును, నిర్దయులు నైరి."

32 "ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు, అను దేవుని న్యాయవిధిని వారు బాగుగా యెరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు."

<< Prev Top Next → >>