Bible, యోహాను సువార్త, అధ్యాయం 4. is available here: https://www.bible.promo/chapters.php?id=11001&pid=45&tid=2&bid=61
Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible

Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / యోహాను సువార్త

Bible - Telugu Bible OV, 1880

లూకా సువార్త యోహాను సువార్త అపొస్తలుల కార్యములు

అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21

1 "యోహాను కంటె యేసు ఎక్కువమందిని శిష్యులనుగా చేసికొని వారికి బాప్తిస్మమిచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు,"

2 ఆయన యూదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్లెను.

3 అయినను యేసే బాప్తిస్మమియ్యలేదు గాని ఆయన శిష్యులిచ్చుచుండిరి.

4 "ఆయన సమరయ మార్గమున వెళ్లవలసివచ్చెను గనుక,"

5 యాకోబు తన కుమారుడైన యోసేపు కిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారను ఒక ఊరికివచ్చెను.

6 అక్కడ యాకోబు బావి యుండెను గనుక యేసు ప్రయాణము వలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను; అప్పటికి ఇంచుమించు పండ్రెండు గంటలాయెను.

7 "సమరయ స్త్రీ ఒకతె నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా, యేసు - ''నాకు దాహమునకిమ్మని'' ఆమె నడిగెను."

8 ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్లియుండిరి.

9 "ఆ సమరయ స్త్రీ - యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఏలాగు అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా, యూదులు సమరయులతో సాంగత్యము చేయరు."

యోహాను సువార్త 4:9 - Jesus and the Samaritan Woman
Jesus and the Samaritan Woman
10 "అందుకు యేసు - ''నీవు దేవుని వరమును, నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చును'' అని ఆమెతో చెప్పెను."

11 "అప్పుడు స్త్రీ - అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీ కేమియు లేదే; ఆ జీవజలము ఏలాగు నీకు దొరుకును ?"

12 "తానును తన కుమాళ్లును, పశువులును, ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రియైన యాకోబు కంటె నీవు గొప్పవాడవా ? అని ఆయనను అడిగెను."

13 అందుకు యేసు - ''ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పిగొనును;

14 నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు ; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండును'' అని ఆమెతో చెప్పెను.

15 "ఆ స్త్రీ ఆయనను చూచి - అయ్యా, నేను దప్పిగొనకుండునట్లును, చేదుకొనుట కింతదూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయు మని అడుగగా,"

16 యేసు- ''నీవు వెళ్లి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్ము'' అని ఆమెతో చెప్పెను.

17 "ఆ స్త్రీ - నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో - నాకు పెనిమిటి లేని నీవు చెప్పిన మాటసరియే;"

18 "నీకు అయిదుగురు పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు; సత్యమే చెప్పితివనెను."

19 "అప్పుడు స్త్రీ - అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను."

20 "మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను"

21 "- ''అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము;"

22 "మీరు మీకు తెలియనిదానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము; రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది."

23 "అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను, సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు."

24 దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలను'' అనెను.

25 "ఆ స్త్రీ ఆయనతో - క్రీస్తనబడిన మెస్సీయ వచ్చునని నేనెరుగుదును; ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా,"

26 యేసు - నీతో మాటలాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పెను.

27 "ఇంతలో ఆయన శిష్యులు వచ్చి, ఆయన స్త్రీతో మాటలాడుట చూచి ఆశ్చర్యపడిరి గాని - నీ కేమి కావలెననియైనను, ఈమెతో ఎందుకు మాటలాడుచున్నావనియైనను ఎవడును అడుగలేదు."

28 ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్లి-

29 "మీరు వచ్చి, నేను చేసిన వన్నియు నాతోచెప్పిన మనుష్యుని చూడుడి; ఈయన క్రీస్తు కాడా? అని ఆ ఊరి వారితో చెప్పగా,"

30 వారు ఊరిలోనుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి.

31 "ఆలోగా శిష్యులు - బోధకుడా, భోజనము చేయుమని ఆయనను వేడుకొనిరి."

32 "అందుకాయన - భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా,"

33 శిష్యులు - ఆయన భుజించుటకు ఎవడైన నేమైనను తెచ్చెనేమో అని యొకనితో ఒకడు చెప్పుకొనిరి.

34 "యేసు వారిని చూచి - నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై యున్నది."

35 ఇంక నాలుగు నెలలైన తరువాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు గదా? ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి; అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చియున్నవని మీతో చెప్పుచున్నాను.

36 "విత్తువాడును కోయువాడును కూడ సంతోషించునట్లు, కోయువాడు జీతము పుచ్చుకొని నిత్యజీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు."

37 విత్తువాడొకడు కోయువాడొక ను మాట ఈ విషయములో సత్యమే.

38 మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మును పంపితిని; ఇతరులు కష్టపడిరి మీరు వారి కష్టఫలములో ప్రవేశించుచున్నారని చెప్పెను.

39 నేను చేసినవన్నియు నాతో చెప్పెనని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటనుబట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి.

40 ఆ సమరయులు ఆయనయొద్దకు వచ్చి తమయొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ రెండు దినములుండెను.

41 "ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి. - ఇక మీదట నీవు చెప్పిన మాటనుబట్టి కాక,"

42 "మామట్టుకు మేము విని, ఈయన నిజముగా లోకరక్షకుడని తెలిసికొని నమ్ముచున్నామనిరి."

43 ఆ రెండు దినములైన తరువాత ఆయన అక్కడ నుండి బయలుదేరి గలిలయకు వెళ్లెను.

44 ఎందుకనగా ప్రవక్త స్వదేశములో ఘనత పొందడని యేసు సాక్ష్యమిచ్చెను.

45 గలిలయులు కూడ ఆ పండుగకు వెళ్లువారు గనుక యెరూషలేములో పండుగ సమయమున ఆయన చేసిన కార్యములన్నియు వారు చూచినందున ఆయన గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి.

46 తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగియై యుండెను.

47 "యేసు యూదయ నుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయన యొద్దకు వెళ్లి, తన కుమారుడు చావ సిద్ధమైయుండెను గనుక ఆయన వచ్చి అతనిని స్వస్థపరచవలెనని వేడుకొనెను."

48 యేసు - సూచక క్రియలను మహాత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పెను.

49 "అందుకా ప్రధాని - ప్రభువా, నా కుమారుడు చావకమునుపే రమ్మని ఆయనను వేడుకొనెను."

50 "యేసు - నీవు వెళ్లుము, నీ కుమారుడు బ్రదికియున్నాడని అతనితో చెప్పగా, ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్లిపోయెను."

51 "అతడింక వెళ్లుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగావచ్చి, అతని కుమారుడు బ్రదికి యున్నాడని తెలియజెప్పిరి."

52 "ఏ గంటకు వాడు బాగుపడసాగెనని వారిని అడిగినప్పుడు, వారు - నిన్న ఒంటి గంటకు జ్వరము వానిని విడిచెనని అతనితో చెప్పిరి."

53 "నీ కుమారుడు బ్రదికియున్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలిసికొనెను గనుక అతడును, అతని యింటి వారందరును నమ్మిరి."

54 ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచకక్రియ.

<< ← Prev Top Next → >>