Bible, లూకా సువార్త, అధ్యాయం 4. is available here: https://www.bible.promo/chapters.php?id=10977&pid=44&tid=2&bid=61
Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible

Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / లూకా సువార్త

Bible - Telugu Bible OV, 1880

మార్కు సువార్త లూకా సువార్త యోహాను సువార్త

అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24

1 "యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై, యొర్దాను నది నుండి తిరిగి వచ్చి నలువది దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి"

2 అపవాది చేత శోధింపబడు చుండెను. ఆ దినములలో ఆయన ఏమియు తినలేదు అవి తీరిన తరువాత ఆయన ఆకలి గొనగా

3 అపవాది - నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను.

4 అందుకు యేసు - ''మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు'' అని వ్రాయబడి యున్నదని వానికి ప్రత్యుత్తర మిచ్చెను.

5 "అప్పుడు అపవాది ఆయనను తీసుకొనిపోయి భూలోక రాజ్యములన్నిటిని ఒక నిమిషములో ఆయనకు చూపించి,"

6 "ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకప్పగింపబడియున్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వాని కిత్తును."

7 కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా యిదంతయు నీదగునని ఆయనతో చెప్పెను.

8 అందుకు యేసు - ''నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను'' అని వ్రాయబడి యున్నదని వానికి ప్రత్యుత్తర మిచ్చెను.

9 "పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి, దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి - నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడ నుండి క్రిందికి దుముకుము,"

10 "నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును,"

11 నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి యున్నదని ఆయనతో చెప్పెను.

12 అందుకు యేసు- ''నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు'' అని చెప్పబడి యున్నదని వానికి ప్రత్యుత్తర మిచ్చెను.

13 అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను.

14 అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను; ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను.

15 "ఆయన అందరి చేత ఘనత నొంది, వారి సమాజ మందిరములలో బోధించుచు వచ్చెను."

16 "తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజమందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలిచియుండగా,"

17 ప్రవక్తయైన యెషయా గ్రంథము ఆయన చేతికియ్యబడెను; ఆయన గ్రంథము విప్పగా-

18 "''ప్రభువు ఆత్మ నా మీద నున్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును (కలుగునని) ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును,"

19 ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి యున్నాడు'' అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరకెను.

20 ఆయన గ్రంథము చుట్టి పరిచారకునకిచ్చి కూర్చుండెను.

21 "సమాజ మందిరములో నున్న వారందరు ఆయనను తేరి చూడగా, ఆయన ''నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది'' అని వారితో చెప్పసాగెను."

22 "ఆప్పుడందరును ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటల కాశ్చర్యపడి - ఈయన యోసేపు కుమారుడు కాడా ? అని చెప్పుకొనుచుండగా,"

23 "ఆయన వారిని చూచి - ''వైద్యుడ, నిన్ను నీవే స్వస్థపరచుకొనుము'' అను సామెత చెప్పి, ''కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసితివని మేము వింటిమో ఆ కార్యములు ఈ నీ స్వదేశము నందును చేయుమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురు'' అనెను."

24 మరియు ఆయన - ''ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

25 "ఏలీయా దినములందు మూడేండ్ల ఆరు నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్పకరవు సంభవించినప్పుడు,"

26 ఇశ్రాయేలులో అనేకమంది విధవరాండ్రున్నను ఏలీయా సీదోను లోని సారెపతు అను ఊరిలో నున్న యొక విధవరాలి యొద్దకే గాని మరియెవరి యొద్దకును పంపబడలేదు.

27 "మరియు ప్రవక్తయైన ఏలిషా కాలమందు ఇశ్రాయేలులో అనేకమంది కుష్టురోగులుండినను, సిరియ దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను'' అనెను."

28 "సమాజమందిరములో ఉన్న వారందరును ఆ మాటలు విని,"

29 "ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందులుగా పడద్రోయవలెనని, తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకొనిపోయిరి."

30 అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళి పోయెను.

31 అప్పుడాయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించు చుండెను.

32 ఆయన వాక్యము అధికారముతో కూడినదై యుండెను గనుక వారాయన బోధకు ఆశ్చర్యపడిరి.

33 ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడొకుండెను.

34 "వాడు - నజరేయుడవైన యేసూ, మాతో నీకేమి ? మమ్ము నశింప జేయవచ్చితివా ? నీ వెవడవో నేనెరుగుదును; నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసెను."

35 "అందుకు యేసు ''ఊరకుండుము, ఇతనిని వదలి పొమ్ము'' అని దానిని గద్దింపగా - దయ్యము వానిని వారి మధ్యలో పడద్రోసి వానికి ఏ హాని చేయక వదలి పోయెను."

36 అందుకందరు విస్మయమొంది - ఇది ఎట్టి మాట? ఈయన అధికారముతోను బలముతోను అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదలి పోవుచున్నవని యొకనితో నొకడు చెప్పుకొనిరి.

37 అంతట ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రాంతము లందంతటను వ్యాపించెను.

38 ఆయన సమాజమందిరములో నుండి లేచి సీమోను యింటిలోనికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడియుండెను గనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకొనిరి.

39 "ఆయన ఆమె చెంతను నిలువబడి, జ్వరమును గద్దింపగానే, అది ఆమెను విడిచెను; వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను."

40 సూర్యుడు అస్తమించుచుండగా నానావిధములైన రోగములచేత పీడింపబడుచున్న వారు ఎవరెవరి యొద్ద నుండిరో వారందరు ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి; అప్పుడాయన వారిలో ప్రతి వానిమీద చేతులుంచి వారిని స్వస్థపరచెను.

41 ఇంతే కాక దయ్యములు - నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదలి పోయెను; ఆయన క్రీస్తు అని వాటికి తెలిసియుండెను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాటాడనీయలేదు.

42 "ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళెను, జనసమూహము ఆయనను వెదకుచు ఆయన యొద్దకువచ్చి తమ్మును విడిచి పోకుండ ఆపగా,"

43 ఆయన- ''నేను ఇతర పట్టణములలో దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను ఇందు నిమిత్తమే నేను పంపబడితిని'' అని వారితో చెప్పెను.

44 తరువాత ఆయన యూదయ సమాజ మందిరములలో ప్రకటించుచుండెను.

<< ← Prev Top Next → >>