Bible, మార్కు సువార్త, అధ్యాయం 5. is available here: https://www.bible.promo/chapters.php?id=10962&pid=43&tid=2&bid=61
Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible

Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / మార్కు సువార్త

Bible - Telugu Bible OV, 1880

మత్తయి సువార్త మార్కు సువార్త లూకా సువార్త

అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

1 వారా సముద్రమునకు అద్దరి నున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి.

2 "ఆయన దోనె దిగగానే, అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధులలో నుండి వచ్చి, ఆయన కెదురు పడెను."

3 వాడు సమాధులలో వాసము చేసెడివాడు. సంకెళ్ళతోనైనను ఎవడును వానిని బంధింపలేకపోయెను.

4 "పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను, వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి, కాలి సంకెళ్ళను తుత్తునియలుగా చేసెను గనుక ఎవరును వానిని సాధుపరచలేక పోయిరి."

5 వాడు ఎల్లప్పుడును రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయుచు తన్ను తాను రాళ్ళతో గాయపర్చు కొనుచుండెను.

6 "వాడు దూరము నుండి యేసును చూచి పరుగెత్తుకొని వచ్చి, ఆయనకు నమస్కారము చేసి-"

7 "యేసూ, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా! నాతో నీకేమి ? నన్ను బాధ పరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టు చున్నానని బిగ్గరగా కేకలు వేసెను."

8 "ఎందుకనగా ఆయన- ''అపవిత్రాత్మా, ఈ మనుష్యుని విడిచి పొమ్మని'' వానితో చెప్పెను."

9 "మరియు ఆయన ''నీ పేరేమని'' వాని నడుగగా వాడు - నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులమని చెప్పి"

10 తమ్మును ఆ దేశము నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బ్రతిమాలుకొనెను.

11 "అక్కడ కొండదగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను,"

12 గనుక - ఆ పందులలో ప్రవేశించునట్లు మమ్మును వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బతిమాలు కొనెను.

13 "యేసు వాటికి సెలవియ్యగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు రెండు వేల సంఖ్యగల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరుగెత్తికొని పోయి, సముద్రములో పడి ఊపిరి తిరుగక చచ్చెను."

14 "ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి, పట్టణములోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి."

15 "జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని, స్వస్థచిత్తుడై, కూర్చుండి యుండుట చూచి భయపడిరి."

16 "జరిగినది చూచినవారు దయ్యములు పట్టినవానికి కలిగిన స్థితియు పందుల సంగతి ఊరి వారికి తెలియజేయగా,"

17 తమ ప్రాంతములు విడిచి పొమ్మని వారాయనను బతిమాలు కొనసాగిరి.

18 "ఆయన దోనె ఎక్కినప్పుడు, దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండ నిమ్మని ఆయనను బతిమాలుకొనెను గాని"

19 "ఆయన వానికి సెలవియ్యక - ''నీవు నీ యింటి వారి యొద్దకు వెళ్ళి, ప్రభువు నీయందు కనికరపడి, నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజెప్పుము'' అనెను."

20 . వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నియు దెకపొలిలో ప్రకటింప నారంభింపగా అందరు ఆశ్చర్యపడిరి.

21 యేసు మరల దోనె యెక్కి అద్దరికి వెళ్ళినప్పుడు - బహు జన సమూహము ఆయన యొద్దకు కూడివచ్చెను

22 "ఆయన సముద్ర తీరమున నుండగా సమాజమందిరపు అధికారులలో యాయీరను నొకడు వచ్చి, ఆయనను చూచి ఆయన పాదములమీద పడి-"

23 "నా చిన్న కుమార్తె చనిపోవుటకు సిద్ధముగా నున్నది; అది బాగుపడి బ్రతుకునట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలెనని ఆయనను మిగుల బతిమాలుకొనగా,"

24 ఆయన అతనితో కూడ వెళ్ళెను; బహు జనసమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి.

25 పన్నెండేళ్ళ నుండి రక్తస్రావ రోగము కలిగిన యొక స్త్రీ యుండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి

26 "తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని, ఎంతమాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను."

27 "ఆమె యేసును గూర్చి విని- నేను ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని,"

28 "జన సమూహములో ఆయనవెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను,"

29 వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరరీములో ఆ బాధ నివారణమైనదని గ్రహించుకొనెను.

30 "వెంటనే యేసు తనలోనుండి ప్రభావము బయటికి వెళ్ళెనని తనలో తాను గ్రహించి, జనసమూహమువైపు తిరిగి- ''నా వస్త్రములు ముట్టిన దెవర'' ని అడుగగా,"

31 ఆయన శిష్యులు - జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే; నన్ను ముట్టినదెవరని అడుగుచున్నావా ? అనిరి.

32 ఆ కార్యము చేసిన ఆమెను కనుగొన వలెనని ఆయన చుట్టూ చూచెను.

33 "అప్పుడు స్త్రీ తనకు జరిగినది యెరిగి, భయపడి, వణకుచువచ్చి, ఆయన యెదుట సాగిలపడి, తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను."

34 "అందుకాయన - ''కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము కలదానవై పొమ్ము; నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగు గాక'' అని ఆమెతో చెప్పెను."

35 "ఆయన ఇంకను మాటలాడుచుండగా, సమాజమందిరపు అధికారి యింట నుండి కొందరు వచ్చి- నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమపెట్టెదవనిరి."

36 "యేసు వారు చెప్పిన మాట లక్ష్యపెట్టక- ''భయపడకుము, నమ్మిక మాత్రముంచుము'' అని సమాజమందిరపు అధికారితో చెప్పి"

37 "పేతురు, యాకోబు, యాకోబు సహోదరుడగు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనను తన వెంబడి రానీయక,"

38 "సమాజమందిరపు అధికారియింటికి వచ్చి, వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు, ప్రలాపించుచు నుండుట చూచి"

39 లోపలికి పోయి మీరేల గొల్లు చేయుచు ఏడ్చుచున్నారు ? ''ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదు'' అని వారితో చెప్పెను.

40 "అందుకు వారాయనను అపహసించిరి. అయితే ఆయన వారినందరిని బయటకు పంపివేసి, ఆ చిన్నదాని తలిదండ్రులను తనతోనున్నవారిని వెంటబెట్టుకొని, ఆ చిన్నది పరుండియున్న గదిలోనికి వెళ్ళి,"

41 ఆ చిన్నదాని చెయి పట్టి - ''తలీతాకుమీ'' అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము.

42 "వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను; ఆమె పన్నెండు సంవత్సరముల ప్రాయము గలది, అక్కడ ఉన్నవారు బహుగా విస్మయమొందిరి."

43 "జరిగినది ఎవనికిని తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి, ''ఆమెకు ఆహారము పెట్టుడి'' అని చెప్పెను."

<< ← Prev Top Next → >>