Bible, మత్తయి సువార్త, అధ్యాయం 26. is available here: https://www.bible.promo/chapters.php?id=10955&pid=42&tid=2&bid=61
Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible

Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / మత్తయి సువార్త

Bible - Telugu Bible OV, 1880

మత్తయి సువార్త మార్కు సువార్త

అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28

1 యేసు ఈ మాటలన్నియు చెప్పి చాలించిన తరువాత ఆయన తన శిష్యులను చూచి -

2 ''రెండు దినములైన తరువాత పస్కా పండుగ వచ్చుననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియును అని అనెను.

3 "ఆ సమయమున ప్రధాన యాజకులును, పెద్దలును కయప అనబడు ప్రధాన యాజకుని మందిరములోనికి కూడి వచ్చి,"

4 యేసును మాయోపాయముచేత పట్టుకొని చంపవలెనని ఏకమై ఆలోచన చేసిరి.

5 అయితే ప్రజలలో అల్లరి కలుగకుండునట్లు పండుగలో వద్దని చెప్పుకొనిరి.

6 యేసు బేతనియలో కుష్టురోగియైన సీమోను ఇంటిలో నున్నప్పుడు

7 ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చొని యుండగా దానిని ఆయన తలమీద పోసెను.

మత్తయి సువార్త 26:7 - Jesus Anointed at Bethany
Jesus Anointed at Bethany
8 "శిష్యులది చూచి, కోపపడి - ''ఎందుకు నష్టము చేయుచున్నావు ?"

9 దీనిని గొప్పవెలకు అమ్మి బీదలకీయవచ్చును గదా'' అనిరి.

10 యేసు ఆ సంగతి తెలిసికొని ''ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను. ఈమెను మీరేల తొందర పెట్టుచున్నారు.

11 "బీదలెల్లప్పుడు మీతో కూడ నున్నారు, గాని నేనెప్పుడు మీతో కూడ నుండను."

12 ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను

13 "సర్వలోకమందు, ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునఅక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రకటింపబడుననియు ప్రశసించబడుననియు మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.'' అని వారితో అనెను."

14 "అప్పుడు ఆయన నొద్దనున్న పన్నెండుమందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా, ప్రధానయాజకుల యొద్దకు వెళ్ళి -"

15 నేనాయనను మీకప్పగించిన యెడల నాకేమి ఇత్తురని వారి నడిగెను. అందుకు వారు ముప్పది వెండి నాణెములు తూచి వానికిచ్చిరి.

16 వాడప్పటి నుండి యేసును అప్పగించుటకు తగిన సమయము కొరకు కనిపెట్టుచుండెను.

17 పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసువద్దకు వచ్చి - పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచ గోరుచున్నావని ఆయనను అడిగిరి.

18 "అందుకాయన - ''మీరు పట్టణమందున్న ఫలాని మనుష్యుని యొద్దకు పోయి, నా కాలము సమీపమైయున్నది; నా శిష్యులతో కూడ నీ ఇంట పస్కాను ఆచరించెదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడి'' అనెను."

19 యేసు తమ కాజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరచిరి.

20 "సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులతో కూడ భోజనము చేయుచుండగా,"

21 ఆయన - ''మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను'' అనెను.

22 "అందుకు వారు బహుగా దుఃఖపడి ప్రతివాడును - నేనా ప్రభువా ? అని ఆయననడుగగా,"

23 ఆయన ''నాతో కూడ పాత్రలో చెయ్యి ముంచినవాడే నన్నప్పగించును.

24 మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగించబడుచున్నాడో వానికి శ్రమ. అ మనుష్యుడు పుట్టి యుండనియెడల వానికి మేలు'' అని వారితో చెప్పెను.

25 "ఆయనను అప్పగించిన యూదా - బోధకుడా, నేనాయని ఆయన ''నీవన్నట్టే'' అనెను."

26 "వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని, దాని నాశీర్వదించి, విరిచి తన శిష్యులకిచ్చి ''మీరు తీసుకొని తినుడి. ఇది నా శరీరము'' అని చెప్పెను."

27 "తరువాత ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, వారికిచ్చి, ''దీనిలోనిది మీరందరు త్రాగుడి."

28 "ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న (క్రొత్త) నిబంధన రక్తము."

29 "నా తండ్రి రాజ్యములో మీతో కూడ రాజ్యములో మీతో కూడ నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగుదినము వరకు, ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నాను'' అనెను."

మత్తయి సువార్త 26:29 - Institution of Lord\'s Supper
Institution of Lord\'s Supper
30 . అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి.

31 అప్పుడు యేసు వారిని చూచి - ''ఈ రాత్రి మీరందరు నా విషయమై అభ్యంతర పడెదరు. ఏలయనగా'' - ''గొఱ్ఱెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయుము'' (జెకర్యా13:7) అని వ్రాయబడి యున్నదిగదా.

32 నేను లేచిన తరువాత మీకంటె ముందుగా గలిలయకు వెళ్ళెదను'' అనెను.

33 "అందుకు పేతురు - ''నీ విషయము అందరూ అభ్యంతరపడినను నేను మాత్రము అభ్యంతర పడను'' అని చెప్పగా,"

34 "యేసు - అతనిని చూచి, ''ఈ రాత్రి కోడి కూయక ముందే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను'' అనెను"

35 పేతురు ఆయనను చూచి - ''నేను నీతో కూడ చావవలసిన యున్నను నిన్ను ఎరుగనని ఎన్నడు చెప్పను'' అనెను. శిష్యులందరు కూడ ఆలాగే అనిరి.

36 "అంతట యేసు వారితో కూడ గెత్సెమనే అనబడిన ప్రదేశమునకు వెళ్ళెను. అక్కడ వారితో ''మీరిక్కడనే కూర్చొని యుండుడి. నేను వెళ్ళి ప్రార్థన చేసి వచ్చెదను'' అని చెప్పి,"

37 "పేతురును, జెబెదయి ఇద్దరు కుమారులను వెంటపెట్టుకొని పోయి, దుఃఖపుటకును చింతా క్రాంతుడగుటకును మొదలుపెట్టెను."

38 అప్పుడు యేసు -''మరణమగునంతగా నా ప్రాణము బహుదుఃఖములో మునిగియున్నది మీరు ఇక్కడ నిలిచి నాతో కూడ మెళకువగా నుండుడి'' అని వారితో చెప్పి

39 "కొంత దూరము వెళ్ళి, సాగిలపడి, - ''నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము గాదు నీ ఇష్టప్రకారమే కానిమ్ము'' అని ప్రార్థించెను."

40 ఆయన మరల శిష్యులనొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి - ''ఒక ఘడియయైనను నాతో కూడ మేల్కొని యుండలేరా ?

41 మీరు శోధనలో పడకుండునట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కాని శరీరము బలహీనము'' అని పేతురుతో చెప్పి

42 "మరల రెండవమారు వెళ్ళి, ''నా తండ్రీ, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నాయొద్దనుండి తొలగని యెడల నీ చిత్తమే సిద్ధించును గాక ''అని ప్రార్థించి,"

43 తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలయనగా వారి కన్నులు భారముగా నుండెను.

44 ఆయన వారిని మరల విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవమారు ప్రార్థన చేసెను.

45 అప్పుడాయన తన శిష్యులనొద్దకు వచ్చి - ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి. ఇదిగో ఆ ఘడియ వచ్చినది మనుష్య కుమారుడు పాపులచేతికి అప్పగించబడుచున్నాడు;

46 "లెండి వెళ్లుదము, నన్ను వారికి అప్పగించు వాడు సమీపించియున్నాడు'' అని వారితో చెప్పెను."

మత్తయి సువార్త 26:46 - Jesus in Gethsemane
Jesus in Gethsemane
47 . ఆయన ఇంకను మాట్లాడుచుండగా పన్నెండు మందిలో ఒకడైన యూదా వచ్చెను. వానితో కూడ బహు జనసమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకులయొద్దనుండియు ప్రజల పెద్దలయొద్దనుండియు వచ్చెను.

48 ". ఆయనను అప్పగించువాడు - నేనెవరిని ముద్దుపెట్టుకొందునో ఆయనే యేసు; ఆయనను పట్టుకొనుడి అని వారికి గురుతు చెప్పి,"

49 ". వెంటనే యేసు నొద్దకు వచ్చి - బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దుపెట్టుకొనెను."

50 ". యేసు - చెలికాడ, నీవు వచ్చినపని చేయుమని చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి."

51 ". ఇదిగో యేసుతో కూడ ఉన్నవారిలో నొకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి, వాని చెవి తెగ నరికెను."

మత్తయి సువార్త 26:51 - Jesus\' Betrayal
Jesus\' Betrayal
52 . యేసు - ''నీ కత్తిని వరలో తిరిగి పెట్టుము కత్తినెత్తినవాడు ఆ కత్తితోనే మరణిస్తాు.

53 ". ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, నేను వేడుకొనినయెడల పన్నెండు సేనావ్యూహముల కంటే ఎక్కువ దూతల సేనలను ఆయన పంప ?"

54 . అట్లు నేను వేడుకొనిన యెడల ఈలాగు జరుగవలె నను లేఖనము ఎట్లు నెరవేరును ? అని అతనితో చెప్పెను.

55 . ఆ ఘడియలోనే యేసు జన సమూహములను చూచి బందిపోటు దొంగమీదికి వచ్చినట్లు కత్తులతోను గుదియలతోను నన్ను పట్టుకొనవచ్చితిరా? నేను అనుదినము దేవాలయములో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొన లేదు

56 . అయితే ప్రవక్తల లేఖనము నెరవేరునట్లు ఇదంతయు జరిగెను.'' అని చెప్పెను. అప్పుడు శిష్యులందరు ఆయనను విడిచి పారిపోయిరి.

57 వారు యేసుని పట్టుకొని ప్రధానయాజకుడైన కయప నొద్దకు తీసుకొనిపోగా అక్కడ శాస్త్రులును పెద్దలును కూడియుండిరి.

58 పేతురు ప్రధానయాజకుని యింటి ముంగిటి వరకు ఆయనను దూరమునుండి వెంబడించి లోపలికిపోయి దీనిని అంతమేమగునో చూడవలెనని బంట్రౌతులతోకూడ కూర్చుండెను.

59 ప్రధానయాజకులును మహాసభ వారందరును యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధసాక్ష్యము కొరకు వెదకుచుండిరి గాని

60 అబద్ధసాక్ష్యులనేకులు వచ్చినను వారికి సాక్ష్యమేమియు దొరక లేదు.

61 తుదకు ఇద్దరు మనుష్యులు వచ్చి - | వీడు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో దానిని కట్టగలనని చెప్పెననిరి.

62 "ప్రధానయాజకుడు లేచి - నీవు సమాధానమేమియు చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమియని అడుగగా, యేసు ఊరకుండెను."

63 అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవముగల దేవుని మీద ఆనబెట్టు చున్నాననెను.

64 "అందుకు యేసు - ''నీవన్నట్టే, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు - సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండి యుండుటయు, ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూచెదరు'' అని చెప్పగా,"

65 "ప్రధానయాజకుడు తన వస్త్రము చింపుకొని, వీడు దేవదూషణ చేసెను మనకిక సాక్ష్యులతో పనియేమి ? ఈ దూషణ మీరందరు ఇప్పుడు విన్నారు."

మత్తయి సువార్త 26:65 - Jesus\' Trial Before Caiaphas
Jesus\' Trial Before Caiaphas
66 "మీకేమి తోచుచున్నదని అడుగగా, | వారు - వీడు మరణమునకు పాత్రుడనిరి."

67 "అప్పుడు వారాయన ముఖముమీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి,"

68 "కొందరు ఆయనను అరచేతులతో కొట్టి - | క్రీస్తూ, నిన్ను కొట్టిన వారెవరో ప్రవచింపుమనిరి."

69 "పేతురు వెలుపల ముంగిట కూర్చొని యుండగా, ఒక చిన్నది వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో నుంటివి గదా? యని అడుగగా,"

70 అతడు - నేనుండ లేదు నీవు చెప్పుసంగతి నాకేమియు తెలియదనెను.

71 తరువాత అక్కడి నుండి కొంత దూరము వెళ్ళినప్పుడు మరియొక చిన్నదతనిని చూచి - వీడును నజరేయుడైన క్రీస్తుతోనుండెను అని అక్కడునున్న వారితో చెప్పెను.

72 "దానికతడు - ఒట్టుపెట్టుకొని నేనుండలేదు, నేనా మనుష్యుని ఎరుగనని మరియొకమారు చెప్పెను."

73 "కొంతసేపయిన తర్వాత అక్కడ నిలిచియున్న కొందరు పేతురునొద్దకు వచ్చి, నిజమే - నీవును వారిలో నొకవే. నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నదని అతనితో చెప్పిరి"

74 అప్పుడతడు - ఆ మనుష్యుని నేనెరుగనని శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టెను. వెంటనే కోడి కూసెను.

75 కనుక కోడి కూయక మునుపు నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాటను పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపి ఏడ్చెను.

<< ← Prev Top Next → >>