Bible, మత్తయి సువార్త, అధ్యాయం 13. is available here: https://www.bible.promo/chapters.php?id=10942&pid=42&tid=2&bid=61
Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible

Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / మత్తయి సువార్త

Bible - Telugu Bible OV, 1880

మత్తయి సువార్త మార్కు సువార్త

అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28

1 ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను.

2 బహుజనసమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోనె యెక్కి కూర్చుండెను. ఆ జనులందరు దరిని నిలిచియుండగా

3 ఆయన వారినందరిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా - ''ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను.

4 వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మ్రింగివేసెను.

5 కొన్ని చాల మన్నులేని రాతి నేలను పడెను; అక్కడ మన్నులోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని

6 సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండి పోయెను.

7 కొన్ని ముండ్ల పొదలలో పడెను; ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసెను.

8 "కొన్ని మంచి నేలను పడి ఒకటి నూరంతలుగాను, ఒకటి అరువదంతలుగాను, ఒకటి ముప్పదంతలు గాను ఫలించెను."

9 చెవులు గలవాడు వినును గాక'' అని చెప్పెను.

10 తరువాత శిష్యులు వచ్చి ''నీవు ఉపమాన రీతిగా వారితో ఎందుకు మాట్లాడు చున్నావని'' అడుగగా యేసు వారితో నిట్లనెను.-

11 ''పరలోక రాజ్య మర్మములు ఎరుగుటమీకనుగ్రహింపబడినది గాని వారికి అనుగ్రహింపబడలేదు.

12 "కలిగినవానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేనివానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు - చూచుచుండియు చూడరు; వినుచుండియు వినకయు గ్రహింపకయు నున్నారు."

13 ఇందు నిమిత్తము నేను ఉపమానరీతిగా వారికి బోధించుచున్నాను.'' ''మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు. నిత్యము చూచుచుందురు గాని తెలిసికొనకుందురు.

14 వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందక పోవునట్లు

15 ఈ జనుల హృదయము క్రొవ్వుజేసి వారి చెవులు మందపరచి వారి కన్నులు మూయించుమని చెప్పెను'' (యెషయా6:9-10) అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది.

16 అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి. మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి

17 అనేక ప్రవక్తలును నీతిమంతులును మీరు చూచువాటిని చూడగోరియు చూడకపోయిరి. మీరు వినువాటిని వినగోరియు వినకపోయిర''ని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

18 ''విత్తువానిని గూర్చిన ఉపమాన భావము వినుడి.

19 "ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక యుండగా, దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తికొని పోవును; త్రోవ ప్రక్కను విత్తబడిన వాడు వీడే."

20 "రాతి నేలను విత్తబడిన వాడు, వాక్యము విని వెంటనే సంతోషముతో దాని నంగీకరించువాడు."

21 "అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును కాని, వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగగానే అభ్యంతరపడును."

22 "ముండ్ల పొదలలో విత్తబడినవాడు వాక్యము వినువాడే కాని ఐహిక విచారమును, ధనమోసమును ఆ వాక్యమును అణచివేయును. గనుక వాడు నిష్పలుడగును."

23 "మంచి నేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు; అట్టివారు సఫలులై ఒకడు నూరంతలు గాను, ఒకడు అరువదంతలు గాను, ఇంకొకు ముప్పదంతలు గాను ఫలించును'' అనెను."

24 ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను. అదేమనగా - ''పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒకమనుష్యుని పోలియున్నది.

25 మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులను విత్తిపోయెను.

26 మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడ కనపడెను.

27 "అప్పుడు యింటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి - అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి గదా; అందులో గురుగులెక్కడ నుండి వచ్చినవని అడిగిరి."

28 "ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీ కిష్టమా అని అతనిని అడిగిరి."

29 "అందుకతడు - వద్దు; గురుగులను పెరుకుచుండగా, వాటితో కూడ ఒకవేళ గోధుమలను పెల్లగింతురు."

30 "కోతకాలము వరకు రెండింటిని కలిసి యెదుగ నియ్యుడి. కోతకాల మందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి, గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదును'' అనెను"

31 "ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను - ''పరలోకరాజ్యము, ఒకడు తీసికొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలియున్నది."

32 "అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూరమొక్కలన్నిటిలో పెద్దదై, ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించునంత చెట్టగును''"

33 ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను - ''పరలోక రాజ్యము ఒక స్త్రీ పులిసిన పిండిని తీసికొని దానిని మూడు కుంచముల పిండి మధ్యలో పెట్టి మొత్తము పిండంతా పులిసి పొంగు వరకు దాచి పెట్టిన పిండిముద్దను పోలియున్నది''

34 ''నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా చెప్పెదను; పూర్వకాలపు (లోకము పుట్టినది మొదలుకొని) గూఢవాక్యములను నేను తెలియ జెప్పెదను'' (కీర్తనలు78:2)

35 "అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు, యేసు ఈ సంగతులన్నిటిని జనసమూహములకు ఉపమానరీతిగా బోధించెను. ఉపమానము లేకుండ వారికేమియు బోధించలేదు."

36 "అప్పుడు ఆయన జన సమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులాయన యొద్దకు వచ్చి పొలములోని గురుగులయొక్క ఉపమానమును గూర్చిన భావము వారికి చెప్పమని ఆయనను కోరగా, ఆయన వారికిట్లు చెప్పెను-"

37 ''మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు.

38 "పొలము లోకము. మంచి విత్తనములు రాజ్య సంబంధులు (కుమారులు), గురుగులు దుష్టుని సంబంధులు (కుమారులు)."

39 "వాటిని విత్తిన శత్రువు అపవాది (సాతాను), కోత యుగసమాప్తి. కోత కోయు వారు దేవదూతలు."

40 గురుగులు ఏలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగసమాప్తియందు జరుగును.

41 మనుష్య కుమారుడు తన దూతలను పంపును; వారాయన రాజ్యములోనుండి ఆటంకములగు సకలమైన వాటిని దుర్నీతిపరులను సమకూర్చి అగ్ని గుండములో పడవేయుదురు.

42 అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయుండును.

43 అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యునివలె తేజరిల్లుదురు. చెవులున్నవాడు వినును గాక''

44 "''పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలియున్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని, దాచిపెట్టి, అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి, ఆ పొలమును కొనును"

45 మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలియున్నది.

46 "అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని, పోయి తనకు ఉన్నదంతయు అమ్మి దానిని కొనును"

47 మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది.

48 "అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి, చెడ్ఢవాటిని బయట పారవేతురు."

49 అలాగే యుగసమాప్తియందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలోనుండి దుష్టులను వేరుపరచి

50 "వీరిని అగ్ని గుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును, పండ్లు కొరుకుటయును ఉండును"

51 "''వీటినన్నిటిని మీరు గ్రహించితిరా?'' అని యేసు వారినడుగగా, వారు గ్రహించితిమనిరి."

52 ఆయన - ''అందువలన పరలోక రాజ్యములో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలోనుండి క్రొత్తపదార్ధములను పాతపదార్ధములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడు'' అని వారితో చెప్పెను

53 యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత అక్కడ నుండి స్వదేశమునకు వచ్చి అక్కడ సమాజ మందిరములలో బోధించుచుండెను.

54 అందువలన వారాశ్చర్యపడి - ఈ జ్ఞానమును ఈ అద్భుతములును ఇతనికి ఎక్కడనుండి వచ్చినవి?

55 "ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా యనువారు ఇతని సహోదరులు కారా?"

56 ఇతని అక్క చెల్లెండ్రందరు మనతోనే ఉన్నారు కదా? ఇతనికి ఈ కార్యములన్నియు ఎక్కడినుండి వచ్చినవని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి.

57 "అయితే యేసు ''ప్రవక్త తన దేశములోను, తన ఇంటను తప్ప మరి ఎక్కడనైనను ఘనహీనుడు కాడు'' అని వారితో చెప్పెను."

58 వాళ్ళు ఆయనను విశ్వసించలేదు గనుక అక్కడ ఎక్కువ అద్భుతములు చేయలేదు.

<< ← Prev Top Next → >>