Bible, 1 పేతురు, అధ్యాయం 4. is available here: https://www.bible.promo/chapters.php?id=11155&pid=62&tid=2&bid=61
Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible

Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / 1 పేతురు

Bible - Telugu Bible OV, 1880

యాకోబు 1 పేతురు 2 పేతురు

అధ్యాయం 1 2 3 4 5

1 క్రీస్తు శరీరరమందు శ్రమపెడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి.

2 "శరీర విషయములో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇకమీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనునట్లు పాపముతో జోలి యిక నేమియులేక యుండును."

3 "మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితోకూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహపూజలు మొదలైనవాటియందు నడుచుకొనుచు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును."

4 అపరిమితమైన ఆ దుర్వాపారమునందు తమతోకూడ మీరు పరుగెత్తక పోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించు చున్నారు.

5 సజీవులకును మృతులకును తీర్పుతీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులైయున్నారు.

6 మృతులు శరీరవిషయములో మానవరీత్యా తీర్పు పొందునట్లును ఆత్మ విషయములో దేవుని బట్టి జీవించునట్లును వారికి కూడ సువార్త ప్రకటింపబడెను.

7 "అయితే అన్నిటి అంతము సమీపమైయున్నది కాగా మీరు స్వస్థబుద్ధిగలవారై, ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి."

8 "ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటె ముఖ్యముగా ఒకనియెడల ఒకడు మిక్కటమైన ప్రేమగలవారై యుండుడి,"

9 సణుగుకొనకుండ ఒకనికి ఒకడు అతిథ్యము చేయుడి.

10 "దేవుని నానావిధమైన కృపవిషయమై మంచి గృహ నిర్వాహకులైయుండి, యొక్కొకడు కృపావరము పొందిన కొలది యొకనికొకడు ఉపచారము చేయుడి."

11 "ఒకడు బోధించినయెడల దైవోక్తులను బోధించునట్లు బోధింపవలెను; ఒకడు ఉపచారము చేసినయెడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోను యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయన కుండునుగాక, ఆమేన్."

12 "ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహా శ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి."

13 "క్రీస్తు మహిమ బయలుపరచ బడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైయున్నంతగా సంతోషించుడి."

14 "క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైనయెడల మహిమాస్వరూపియైన ఆత్మ అనగా దేవుని ఆత్మ, మీ మీద నిలుచు చున్నాడు గనుక మీరు ధన్యులు."

15 "మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరులజోలికి పోవువాడుగాగాని బాధ అనుభవింప తగదు."

16 "ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినయెడల అతడు సిగ్గుపడక, ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను."

17 తీర్పు దేవుని ఇంటియొద్ద ఆరంభమగు కాలము వచ్చియున్నది; అది మనయొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును ?

18 మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తి హీనుడును పాపియు ఎక్కడ నిలుతురు?

19 "కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ ప్రవర్తన గలవారై, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను."

<< ← Prev Top Next → >>