Bible, 1 పేతురు, అధ్యాయం 3. is available here: https://www.bible.promo/chapters.php?id=11154&pid=62&tid=2&bid=61
Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible

Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / 1 పేతురు

Bible - Telugu Bible OV, 1880

యాకోబు 1 పేతురు 2 పేతురు

అధ్యాయం 1 2 3 4 5

1 "ఆటువలె స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి; అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే"

2 "వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి, వాక్యము లేకుండనే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును."

3 "జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించు కొనుట యునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక,"

4 "సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది."

5 అటువలె పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలును తమ స్వపురుషులకు లోబడి యుండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి.

6 "ఆ ప్రకారము శారా అబ్రాహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి యుండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు, ఏ భయమునకు బెదరక యున్న యెడల ఆమెకు పిల్లలగుదురు."

7 "అటువలెనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారైయున్నారని యెరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు, జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి."

8 "తుదకు మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖముల యందు ఒకరు పాలుపడి, సహోదర ప్రేమ గల వారును, కరుణా చిత్తులును, వినయ మనస్కులునై యుండుడి."

9 "ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను, దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి."

10 "జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్ఢదాని పలుకకుండ తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను కాచుకొనవలెను."

11 "అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దాని వెంటాడవలెను."

12 "ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయువారికి విరోధముగా ఉన్నది."

13 మీరు మంచి విషయములో ఆసక్తిగల వారైతే మీకు హాని చేయువాడెవడు?

14 "మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే; వారి బెదరింపునకు భయపడకుడి, కలవరపడకుడి;"

15 "నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి, మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్టించుడి."

16 అప్పుడు మీరు దేనివిషయమై దుర్మార్గులని దూషింప బడుదురో దాని విషయమై క్రీస్తు నందున్న మీ సత్ ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు.

17 దేవుని చిత్తమాలాగున్న యెడల కీడుచేసి శ్రమపడుట కంటె మేలుచేసి శ్రమపడుటయే బహు మంచిది.

18 "ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు, ఆత్మ విషయములో బ్రదికింపబడి, పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను."

19 "దేవుని దీర్ఘశాంతము ఇంక కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడు చుండగా, అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు, ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను."

20 "ఆ ఓడలో కొందరు, అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి."

21 "దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది; అదేదనగా, శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే."

22 ఆయన పరలోకమునకు వెళ్లి దూతలమీదను అధికారులమీదను శక్తులమీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు.

<< ← Prev Top Next → >>