Bible, ఎఫెసీయులకు, అధ్యాయం 1. is available here: https://www.bible.promo/chapters.php?id=11098&pid=51&tid=2&bid=61
Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible

Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / ఎఫెసీయులకు

Bible - Telugu Bible OV, 1880

గలతీయులకు ఎఫెసీయులకు ఫిలిప్పీయులకు

అధ్యాయం 1 2 3 4 5 6

1 దేవుని చిత్తమువలన క్రీస్తుయేసు అపొస్తలుడైన పౌలు ఎఫెసులో నున్న పరిశుద్ధులును క్రీస్తుయేసు నందు విశ్వాసులునైన వారికి శుభమని చెప్పి వ్రాయునది.

2 మన తండ్రియైన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు సమాధానమును కలుగును గాక.

3 మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను.

4 "ఎట్లనగా, తన ప్రియునియందు తాను ఉచితముగా మన కనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు,"

5 "తన చిత్తప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులునుగా స్వీకరించుటకై, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే,"

6 ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.

7 "దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది."

8 "కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన ఏర్పాటును బట్టి,"

9 "ఆయన తన దయాసంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి, మనకు సంపూర్ణమైన జ్ఞానవివేచన కలుగుటకు, ఆ కృపను మనయెడల విస్తరింపజేసెను."

10 "ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని, భూమిమీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను."

11 మరియు క్రీస్తు నందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని

12 "దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా జేసిన నిర్ణయము చొప్పున సమస్తకార్యములను జరిగించుచున్నాడు."

13 మీరును సత్య వాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి.

14 "దేవుని మహిమకు కీర్తి కలుగుటకై, ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. దేవుని తెలిసికొనుట కొరకు పౌలు ప్రార్థన."

15 "ఈ హేతువు చేత, ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు, పరిశుద్ధులందరి యెడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను వినినప్పటి నుండి,"

16 మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

17 "మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, ఆయన మిమ్మును పిలిచిన పిలుపువలననైన నిరీక్షణ యెట్టిదో,"

18 "పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యమెట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్మ్యమెట్టిదో,"

19 "మీరు తెలిసికొనవలెనని, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించునట్లు, నేను నా ప్రార్థనలయందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను."

20 ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను అధికారము కంటెను శక్తికంటెను ప్రభుత్వము కంటెను ఈ యుగమునందే కాక రాబోవు యుగమునందును పేరు పొందిన

21 "ప్రతి నామము కంటెను, ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని యున్నాడు."

22 "మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను."

23 "ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయైయున్నది."

<< Prev Top Next → >>