Bible, యోహాను సువార్త, అధ్యాయం 19. is available here: https://www.bible.promo/chapters.php?id=11016&pid=45&tid=2&bid=61
Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible

Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / యోహాను సువార్త

Bible - Telugu Bible OV, 1880

లూకా సువార్త యోహాను సువార్త అపొస్తలుల కార్యములు

అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21

1 అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను.

2 "సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి,"

3 "ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి, ఆయన యొద్దకు వచ్చి - యూదుల రాజా, శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి."

4 పిలాతు మరల వెలుపలికి వచ్చి - ఇదిగో ఈయనయందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియునట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని వారితో అనెను.

5 "ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించినవాడై, యేసు వెలులికి రాగా, పిలాతు - ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను."

6 "ప్రధానయాజకులును బంట్రౌతులును ఆయనను చూచి - సిలువవేయుము సిలువవేయుము అని కేకలు వేయగా, పిలాతు - ఆయనయందు ఏ దోషమును నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసికొనిపోయి సిలువ వేయుడని వారితో చెప్పెను."

7 అందుకు యూదులు - మాకొక నియమము కలదు; తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమముచొప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పిరి.

8 "పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి, తిరిగి అధికార మందిరములో ప్రవేశించి,"

9 "- నీవెక్కడనుండి వచ్చితివని యేసును అడిగెను; అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు,"

10 "గనుక పిలాతు - నాతో మాటలాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు, నిన్ను సిలువవేయుటకు నాకు అధికారము కలదనియు నీవెరుగవా? అని ఆయనతో అనెను."

11 అందుకు యేసు - ''పైనుండి నీకు ఇయ్యబడి యుంటెనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు; అందుచేత నన్ను నీకు అప్పగించినవానికి ఎక్కువ పాపము కలదు'' అనెను.

12 "ఈ మాటనుబట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నము చేసెను గాని, యూదులు - నీవు ఇతని విడుదలచేసితివా కైసరునకు స్నేహితుడవు కావు; తాను రాజునని చెప్పకొను ప్రతివాడును కైసరునకు విరోధముగా మాటలాడుచున్నవాడే అని కేకలు వేసిరి."

13 "పిలాతు ఈ మాటలు విని, యేసును బయటికి తీసికొనివచ్చి, రాళ్లు పరచిన స్థలమందు న్యాయపీఠముమీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బతాఅని పేరు."

14 "ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము; అప్పుడు ఉదయము ఆరు గంటలు కావచ్చెను. అతడు - ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా,"

15 "అందుకు వారు - ఇతనిని సంహరించుము, సంహరించుము, సిలువవేయుము అని కేకలు వేసిరి, పిలాతు - మీ రాజును సిలువవేయుదునా? అని వారిని అడుగగా, ప్రధానయాజకులు - కైసరు తప్ప మాకు వేరొక రాజు లేనిరి."

యోహాను సువార్త 19:15 - Jesus Before Pilate
Jesus Before Pilate
16 అప్పుడు సిలువ వేయబడుటకై అతయనను వారికి అప్పగించెను.

17 వారు యేసును తీసికొనిపోయిరి. ఆయన తన సిలువ మోసికొని కపాలస్థలమును చోటికి వెళ్లెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు.

18 అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకనిని మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడ ఇద్దరిని సిలువవేసిరి.

19 మరియు పిలాతు - 'యూదులరాజైన నజరేయుడగు యేసు' అను పైవిలాసము వ్రాయించి సిలువ మీద పెట్టించెను.

20 "యేసు సిలువవేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై యుండెను, అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషలలో వ్రాయబడెను గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి."

21 "నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయుము గాని - యూదుల రాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా,"

22 పిలాతు - నేను వ్రాసిన దేమో వ్రాసితిననెను.

23 "సైనికులు యేసును సిలువవేసిన తరువాత ఆయన వస్త్రములు తీసికొని, యొక్కొక్క సైనికునికి ఒక్కొక భాగము వచ్చునట్లు వాటిని నాలుగు భాగములు చేసిరి. ఆయన అంగీని కూడ తీసికొని, ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది గనుక"

24 "వారు - దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దాని కోసరము చీట్లు వేయుదమని యొకరితో ఒకరు చెప్పుకొనిరి. కీర్తనలు22:18లో ''నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు'' అను లేఖనము నెరవేరు నట్లు ఇది జరిగెను; ఇందుకే సైనికులు ఈలాగు చేసిరి."

25 "ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్యయైన మరియయు, మగ్దలేనే మరియయు యేసు సిలువయొద్ద నిలుచుండిరి."

26 "యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి - ''అమ్మా, ఇదిగో నీ కుమారుడు'' అని తన తల్లితో చెప్పెను."

27 తరువాత శిష్యుని చూచి - ''ఇదిగో నీ తల్లి'' అని చెప్పెను. ఆ ఘడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన యింట చేర్చుకొనెను.

28 "అటుతరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు - నేను దప్పిగొనుచున్నాననెను."

29 "చిరకతో నిండియున్న యొక పాత్ర అక్కడ పెట్టియుండెను గనుక వారు ఒక స్పంజీ చిరకతో నింపి, హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి."

30 యేసు ఆ చిరక పుచ్చుకొని - సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను.

యోహాను సువార్త 19:30 - The Crucifixion
The Crucifixion
31 "ఆ దినము సిద్ధపరచుదినము; మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండునట్లు, వారి కాళ్లు విరుగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి."

32 కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడ సిలువేయబడిన మొదటి వాని కాళ్లను రెండవవాని కాళ్లను విరుగగొట్టిరి.

33 "వారు యేసు నొద్దకు వచ్చి, అంతకుముందే ఆయన మృతిపొందియుండుట చూచి ఆయన కాళ్లు విరుగగొట్టలేదు గాని,"

34 "సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను."

35 ఇది చూచినవాడు సాక్ష్యమిచ్చుచున్నాడు; అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును.

36 "కీర్తనలు 34:20లో వ్రాయబడినట్లు ''ఆయన వాని యెముకలన్నిటిని కాపాడును, వాటి ఒకటైనను విరిగిపోదు'' అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగెను."

37 "మరియు కీర్తనలు 22:16,17లో ''వారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు నా ఎముకలన్నియు నేను లెక్కింపగలను, వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు'' అనగా తాము పొడిచిన వాని తట్టు చూతురు అని మరియొక లేఖనము చెప్పుచున్నది."

38 "అటు తరువాత, యూదుల భయమువలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయియ యోసేపు, తాను యేసు దేహమును తీసికొనిపోవుటకు పిలాతునొద్ద సెలవడిగెను; పిలాతు సెలవిచ్చెను. గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయెను."

39 మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నీకొదేము కూడ బోళముతో కలిపిన అగరు రమారమి నూట ఏబది సేర్ల యెత్తు తెచ్చెను.

40 "అంతట వారు యేసు దేహమును ఎత్తికొని వచ్చి, యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి."

యోహాను సువార్త 19:40 - Jesus Buried
Jesus Buried
41 ఆయనను సిలువవేసిన స్థలములో ఒక తోట యుండెను; ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్త సమాధియొకటి యుండెను.

42 ఆ సమాధి సమీపములో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి.

<< ← Prev Top Next → >>