Bible, లూకా సువార్త, అధ్యాయం 18. is available here: https://www.bible.promo/chapters.php?id=10991&pid=44&tid=2&bid=61
Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible

Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / లూకా సువార్త

Bible - Telugu Bible OV, 1880

మార్కు సువార్త లూకా సువార్త యోహాను సువార్త

అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24

1 వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను -

2 "''దేవునికి భయపడకము, మనుష్యులను లక్ష్యపెట్టక యుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో నుండెను."

3 "ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచు వచ్చెను, గాని"

4 "అతడు కొంత కాలము ఒప్పకపోయెను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయు ఉండినను,"

5 ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది. గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాననుకొనెను.

6 మరియు ప్రభువిట్లనెను- ''అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి.

7 దేవుడు తాను ఏర్పరచు కొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా ?

8 ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా ?''

9 తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని యితరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను-

10 "''ప్రార్థన చేయుటకై యిద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి."

11 "పరిసయ్యుడు నిలువబడి - దేవా, నేను చోరులును అన్యాయస్థులును వ్యభిచారులునైన ఇతర మనుష్యుల వలెనైనను ఈ సుంకరి వలెనైను ఉండనందుకు నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాను;"

12 "వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచు, నా సంపాదనయంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించు చుండెను."

13 "అయితే సుంకరి దూరముగా నిలుచుండి, ఆకాశమువైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు- ''దేవా, పాపినైన నన్ను కరుణించుము'' అని పలికెను."

లూకా సువార్త 18:13 - The Pharisee and Tax Collector
The Pharisee and Tax Collector
14 "అతని కంటె ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన యింటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించు కొనువాడు తగ్గింపబడుననియు, తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును'' అనియు చెప్పెను."

15 "తమ శిశువులను ముట్టవలెనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని రాగా, ఆయన శిష్యులు అది చూచి తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి."

16 "అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి - ''చిన్నబిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి, దేవుని రాజ్యము ఈలాటి వారిదే."

17 చిన్న బిడ్డవలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రమును ప్రవేశింపని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను'' అనెను. నిత్యజీవమునకు ధనమొక ఆటంకము

18 "ఒక అధికారి ఆయనను చూచి - సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలెనని ఆయననడిగెను."

19 అందుకు యేసు - ''నేను సత్పురుషుడనని ఏల చెప్పుచున్నావు ? దేవుడొక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు.

20 "వ్యభిచరింప వద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధసాక్ష్యము పలుకవద్దు, నీ తలిదండ్రులను సన్మానింపుమను ఆజ్ఞలును ఎరుగుదువు గదా'' అని అతనితో చెప్పెను."

21 అందుకతడు బాల్యము నుండి వీటన్నిటిని అనుసరించుచునే యున్నాననెను.

22 యేసు విని- ''నీకింక ఒకటి కొదువగా నున్నది. నీకు కలిగినవన్నియు అమ్మి బీదలకిమ్ము. అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపుము'' అని అతనితో చెప్పెను.

23 "అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా,"

24 యేసు అతని చూచి- ''ఆస్థి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము.

25 ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటె సూది బెజ్జములో ఒంటె దూరుట సులభము'' అని చెప్పెను.

26 "ఇది వినిన వారు - ''ఆలాగైతే ఎవడు రక్షణ పొందగలడు'' అని అడుగగా,"

27 ఆయన- ''మనుష్యులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యములు'' అని చెప్పెను

28 "పేతురు - ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమనగా,"

29 ఆయన- ''దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తలిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును

30 "ఇహమందు చాలరెట్లును, పరమందు నిత్యజీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను''అని వారితో అనెను."

31 ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి ''ఇదిగో యెరూష లేమునకు వెళ్ళుచున్నాము. మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నియు నెరవేర్చబడును.

32 "ఆయన అన్యజనుల కప్పగింపబడును; వారు ఆయనను అపహసించి అవమానపరచి ఆయన మీద ఉమ్మివేసి,"

33 ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. మూడవ దినమున ఆయన మరల లేచును'' అని చెప్పెను.

34 "వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు, ఈ సంగతి వారికి మరుగుచేయబడెను గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు"

35 ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి బిక్షమడుగుకొనుచుండెను.

36 జనసమూహము దాటి పోవుచున్నట్టు వాడు చప్పుడు విని- ఇది ఏమని అడుగగా

37 వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి.

38 "అప్పుడు వాడు - ''యేసూ, దావీదు కుమారుడ నన్ను కరుణించుము'' అని కేకలు వేయగా,"

39 "ఊరకుండుమని ముందర నడుచుచుండిన వారు వానిని గద్దించిరి గాని, వాడు మరి ఎక్కువగా - ''దావీదు కుమారుడా, నన్ను కరుణించుము'' అని కేకలు వేసెను."

40 అంతట యేసు నిలిచి అతనిని ఆయన దగ్గరకు తీసుకొని రమ్మనెను.

41 "అతడు దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన ''నేను నీకేమి చేయ గోరుచున్నావు'' అని అడుగగా, వాడు - ప్రభువా, చూపు పొంద గోరుచున్నాను అనెను"

42 యేసు ''చూపు పొందుము. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను'' అని వానితో చెప్పెను.

43 వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమ పరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరు అది చూచి దేవుని స్తోత్రము చేసిరి.

<< ← Prev Top Next → >>